కారేపల్లి, జూన్ 23 : విద్యుదాఘాతంతో పాడి బర్రె మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం గేటుకారేపల్లి సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. మేకలతండా గ్రామానికి చెందిన గుగులోత్ రవీందర్ కు చెందిన పాడి గేదె మేతకు గేటుకారేపల్లి హైస్కూల్ సమీపంలోని పోలాల వద్దకు వెళ్లింది. ఆ ప్రాంతంలో బావులకు విద్యుత్ సరఫరా చేసే కరెంట్ తీగలు క్రిందకు వేలాడుతుండడంతో అక్కడికి మేతకు వచ్చిన బర్రెకు తీగలగా కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయమై విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. తమకు జీవనాధారమై పాడి బర్రె మృతి చెందిందని, తమను ఆదుకోవాలని బాధితుడు అధికారులను వేడుకున్నాడు.