ఖమ్మం, జూన్ 7 : బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఖమ్మం నగరానికి రానున్నారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దశదిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేటీఆర్ రానున్నారు.
ఆయనతోపాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం నల్లగొండ జిల్లాలో జరిగే ఓ వేడుకలో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు ఖమ్మం నగరానికి చేరుకోనున్నారు. తర్వాత రఘుపాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామానికి చేరుకుని మదన్‌లాల్ దశదిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు.