ప్రధాన ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్
గూండాలను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. గజ్వేల్‌లో జరి
గిన దాడులను ఖండిస్తూ శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం
చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే దాడులు జరిగాయని మండిపడ్డారు. ఇటువంటి దాడులు ప్రజా
స్వామ్యానికి ఒక మచ్చలాగా మిగిలిపోతాయని పేర్కొన్నారు. దుండగులను అరెస్టు చేయాలని లేకుంటే రాష్ట్ర
వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. – నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 4
తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల ఫాసిస్టు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికే రక్షణ ఇవ్వలేని స్థితిలో పోలీస్ వ్యవస్థ ఉండటం సిగ్గుపడాల్సిన విషయం. కాంగ్రెస్ గూండాలపైన, దాడి చేస్తున్నంత సేపు చోద్యం చూసిన పోలీసులపైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోలేని కాంగ్రెస్ నాయకులు గోడల మీద బలవంతంగా ఫొటోలు పెట్టడం ద్వారా గుర్తింపురాదు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వారి అరాచక సంస్కృతికి అద్దం పడుతోంది. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి.
– తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
ప్రధాన ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కాంపు కార్యాలయంపై జరిగిన దాడి హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా నిలుస్తాయి. రాజకీయ విభేదాలు హింసకు దారి తీయకూడదు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే, ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలి.
– నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ, ఖమ్మం
కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.. అందుకే ఇలా రెచ్చిపోతున్నారు.. రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు అధికారం ఇస్తే ఇలా అరాచకాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిలదీస్తుంటే సహించలేక దాడులకు పాల్పడటం రేవంత్ సర్కార్‌కు పరిపాటిగా మారింది. మాజీ సీఎం క్యాంపు ఆఫీస్‌కు కూడా రక్షణ ఇవ్వలేని స్థితిలో పోలీస్ వ్యవస్థ ఉందంటే సిగ్గుచేటు.
– రేగా కాంతారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి పిరికిపంద చర్య. కాంగ్రెస్ పాలనపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తికి కాంగ్రెస్ ఇచ్చే మర్యాద ఇదేనా? ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు ఇటువంటి ప్రేరేపిత ఘటనలకు కాంగ్రెస్ నాయకులు పాల్పడుతున్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం.
– బానోతు చంద్రావతి, మాజీ ఎమ్మెల్యే, వైరా
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిని చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాయిజం నడుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ దాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ప్రతిపక్ష నేతకే రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో అర్థంకావడం లేదు. ఈ దాడి ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే జరిగింది. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయిస్తూ సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నాడు.
– లింగాల కమల్‌రాజు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్
మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య. అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు గోడలపై బలవంతంగా సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం కాంగ్రెస్ రాజకీయ దివాళాతనానికి నిదర్శనం.
– మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే
గజ్వేల్‌లో మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడితో సమానం. ఫొటోలు గోడలపై కాదు.. ప్రజల గుండెల్లో ఉండాలి. దాడి వెనుక ముమ్మాటికీ సీఎం రేవంత్‌రెడ్డి ప్రోద్భలం ఉంది. క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవటాన్ని జీర్ణించుకోలేక దాడులకు పాల్పడ్డారు. ఇటువంటి రాజకీయ కక్ష సాధింపులు సరైనవి కావు. దుండగులను అరెస్టు చేయాలి. లేకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం.
– తాటి వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తోంది. కాంగ్రెస్ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. తన ప్రాణం సైతం లెక్కచేయకుండా తెలంగాణను సాధించిన కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం సరికాదు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా వినాశనం, విధ్వంసం, దాడులు, కొట్లాటలు, ఇల్లు కూలగొట్టడం వంటి అరాచకాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపడం లేదు. రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా.. లేరా అర్థంకావడం లేదు.
– బానోతు హరిప్రియ, మాజీ ఎమ్మెల్యే, ఇల్లెందు