ఖమ్మం, జూలై 12: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీ సంక్షేమం సాధ్యమైందని, గత ప్రభుత్వాలు ముస్లింలను పట్టించుకోలేదని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరంలోని మోమినాన్లో నిర్వహించిన ఖురేషి ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ముస్లింలు తనను అజయ్”ఖాన్’గా దగ్గర చేసుకున్నారన్నారు. ఖమ్మానికి ఇప్పుడు కొత్త బిచ్చగాళ్లు వచ్చారని, వారు కొందరు చిల్లర నాయకులను వెంటబెట్టుకుని ప్రజల్లోకి వస్తున్నారన్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్నామని, షాదీముబారక్ పథకంలో భాగంగా ఆడబిడ్డ వివాహానికి నగదు అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామన్నారు. ముస్లింల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, కార్పొరేటర్ దాదె అమృతమ్మ, నాయకులు సురేశ్, గౌస్, మహబూబ్ ఆలీ, షరీఫ్, ఆయుబ్, ఇంతియాజ్, చోటు, గయాజ్, ఖాజాబీ పాల్గొన్నారు.
ఖమ్మం, జూలై 12: ఖమ్మ నగరం అన్నిరంగాల్లో రోల్‌మోడల్‌గా నిలుస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులు అందించి మాట్లాడారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఉచితంగా లైసెన్స్‌లు ఇస్తున్నామన్నారు. ఇక్కడ కార్యక్రమం విజయవంతమవడంతో ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులూ తమ ప్రాంతంలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. తాను రూ.50 లక్షల సొంత నిధులతో 10 వేల మందికి లైసెన్సులు ఇస్తున్నానన్నారు. లైసెన్సు పొందడంలో యువత అశ్రద్ధ వహించొద్దన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఆర్టీవో కిషన్‌రావు, జిల్లా ఆర్టీఏ మెంబర్ వల్లభనేని రామారావు, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, ఎంవీఐ వరప్రసాద్, కారచ్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, బత్తుల మురళి, పాలడుగు పాపారావు, తన్నీరు శోభారాణి, షేకీన, కన్నం ప్రసన్న కృష్ణ పాల్గొన్నారు.