భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 26న జరగాల్సిన సమావేశాన్ని 25కు మార్చినట్లు చెప్పారు. కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు హాజరవుతారని తెలిపారు. పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.