మధిర (చింతకాని), జనవరి 6 : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీల అమలు కోసం ఉద్యమాలు చేయాలని జడ్పీ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.
చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహాక సమావేశం మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఆరు గ్యారెంటీలపై అతీగతీ లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, రుణమాఫీ, కేసీఆర్ కిట్టు, కల్యాణలక్ష్మి వంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు.
ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యదర్శి బొడ్డు వెంకటరామారావు, మండల నాయకులు వంకాయలపాటి లచ్చయ్య, మంకెన రమేశ్, మాజీ వైస్ ఎంపీపీ గురజాల హన్మంతరావు, వేముల నర్సయ్య, ఆళ్ల పాకాలరావు, చాట్ల సురేశ్, సామినేని అప్పారావు, నన్నక కోటయ్య, మైనార్టీ నాయకుడు జావిద్ తదితరులు పాల్గొన్నారు.