BRS Party Farmers wing | మధిర, మార్చి 5: కోట్లు ఖర్చుపెట్టినా రైతులకు సాగునీరు అందించని జాలిముడి ప్రాజెక్టు ఎందుకని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మండలంలోని జాలిముడి గ్రామంలో గల జాలిముడి ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కూలిపోయిన లెఫ్ట్ కెనాల్, తూము షట్టర్ ను , వరద కాలువ వలన రైతులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రయోజనం లేని ప్రాజెక్టు నిర్మాణం చేశారని వివరించారు.
ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ.. జాలిముడి ప్రాజెక్టు నిర్మాణం ఆనాడు (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సిరిపురం వద్ద వర్చుల్ శంకుస్థాపన చేశారు. ఆనాడు 4700 ఎకరాలకు నీరు అందించేలా కుడి ఎడమ కాలువలను ఏర్పాటు చేశారు.
మధిర బోనకల్లు మండలాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారన్నారు. అంతేకాకుండా నాటి ఎమ్మెల్యే నేటి డిప్యూటీ సీఎం జాలిముడి ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టు.. నీళ్లే కాకుండా ఈ ప్రాంతం ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది అని చెప్పి కోట్ల రూపాయలను ఇక్కడ ఖర్చు చేయడం జరిగిందన్నారు.
ప్రాజెక్టు పనులు పూర్తయిన తర్వాత కనీసం తూములో నుంచి కాలువలకు సాగునీరు సరఫరా అయ్యే పరిస్థితి లేదన్నారు. ఒక పది నెలల క్రితం వచ్చిన తుఫాను కారణంగా లెఫ్ట్ కెనాల్ కాలువ కొట్టుకొని పోయిందన్నారు. ఇప్పటివరకు కొట్టుకొని పోయిన కాలువను అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, డిప్యూటీ సీఎం పట్టించుకునే పాపాన పోలేదని మండిపడ్డారు.
నిజంగా మీరు చెప్పినట్టుగా కట్టిన ప్రాజెక్టు ద్వారా లెఫ్ట్ కెనాల్ కింద 2700ఎకరాల నీరు అందిస్తున్నామని అనుకుంటే కాలువ కొట్టుకుపోయి పది నెలలైనా మరమ్మతులు చేయకుండా ఉంటే రైతులు పంటలు ఎలా సాగు చేసుకుంటారు అని ప్రశ్నించారు. మీరు కట్టిన చిన్న ప్రాజెక్టు అయినటువంటి జాలిముడి ప్రాజెక్టుని భూతద్దంలో చూపించి పంటల అవసరాల మీద ఒక ఎకరాన్ని కూడా సాగునీరు అందించిన పరిస్థితి లేదన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడే మాటలు చూస్తుంటే పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. మీరు కట్టిన ప్రాజెక్ట్ ద్వారా నీటిని అందించడం లేదు గానీ సీతారామ ప్రాజెక్టు తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ చేపట్టిన ప్రాజెక్టు ద్వారా మీరు నీటిని విడుదల చేస్తున్నారన్నారు.ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధి రైతుల ప్రజల పట్ల ఎవరికి ఉన్నదని ఈ జాలిగుడు ప్రాజెక్టు చూస్తేనే తెలుస్తుంది అన్నారు.
ప్రజల కోసం తెచ్చిన ప్రాజెక్టు కాదు..
జాలిముడి ప్రాజెక్టు నిర్మాణం ఆనాడైనా.. ఈనాడైనా రైతుల కోసం ప్రజల కోసం తెచ్చిన ప్రాజెక్టు కాదని డబ్బులు కోసం కమిషన్ల కోసం తీసుకువచ్చిన ప్రాజెక్టు అని ఆరోపించారు. ప్రాజెక్టు ప్రారంభించే రోజుల్లో కూడా తాము ఏనాడూ విమర్శలు చేయలేదన్నారు. కానీ ప్రాజెక్టు పూర్తయి పదేళ్లయిన రైతులకు సాగునీరందన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ఏ రకంగా నైనా ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలన్న ఆలోచన చేయండి.
అధికారంలో ఉన్నారని కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులపై మీరు విమర్శలు చేస్తున్నారు కానీ మీరు కట్టించినట్వంటి జాలిముడి ప్రాజెక్టును పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు వలన రైతులకు, ప్రజలకు ఉపయోగలు తీసుకొచ్చే పరిస్థితి మీరు చేయడం లేదన్నారు. ఈ జాలిముడి రీ డిజైన్ చేస్తారా..? మీకున్న అంగ బలం, ఆర్థిక బలంతో ప్రజలకు రైతులకు ఏవిధంగా అందుబాటులోకి తీసుకొస్తారన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు.
కొట్టుకుపోయిన కాల్వను మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టు పక్కనే ఉన్న రైతులను కాపాడేందుకు వరద కాలువ ఏర్పాటు చేయాలన్నారు. ఈ జాలిముడి రైతులకు ప్రాజెక్టు వలన కలిగే ప్రయోజనం కంటే వరద నీటి వల్ల కలిగే నష్టం ఎక్కువగా ఉందన్నారు. ఈ విషయంపై వెంటనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అధికారులు స్పందించి రైతులకు అందించవలసిన సాగునీటిని మరమ్మత్తు పనులను తక్షణమే చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు పార్టీ మండల మధిర టౌన్ సెక్రటరీలు బొగ్గుల భాస్కర్ రెడ్డి, అరిక శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ లు మరతం నరసింహారావు, కనకుపూడి పెద్ద బుచ్చయ్య, మాజీ రైతు సమన్వయ సమితి చావా వేణు బాబు, మాజీ కౌన్సిలర్ యన్నంశెట్టి అప్పారావు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కటికల సత్యనారాయణ రెడ్డి, కర్నాటి శీను,బొగ్గుల వీరారెడ్డి,కున నరేందర్ రెడ్డి, ఐలూరి ఉమామహేశ్వర్ రెడ్డి, జీడిమెట్ల కృష్ణ, ఐలూరి వీరారెడ్డి, ఐలూరి నర్సిరెడ్డి, పంతంగి రాంబాబు, కొంగర రంగయ్య, కొంగర విశ్వేశ్వరరావు, బాదినేని అంజయ్య, బాదినేని వెంకట్రామయ్య, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాగబాబు, చిధిరాల రాంబాబు, నాగులవంచ రామారావు తదితరులు పాల్గొన్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు