ఖమ్మం, అక్టోబర్ 27 : నగర ప్రజలందరికీ ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్ట,సుఖాలు, బాధలు, ఇబ్బందుల్లో అండగా ఉన్నానని, ఎవరికి కష్టమొచ్చిని అన్నా అంటే అందుబాటులో ఉండే తనను మరోసారి ఆశీర్వదించండి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని రవాణా శాఖామంత్రి , బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం నగరంలో 26వ డివిజన్ చర్చ్కాంపౌండ్లో పీస్ కమిటీ చైర్మన్ పల్లా రాజశేఖర్ అధ్వర్యంలో ఆయన నివాసంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా నా ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి నేను మీ వెంటే ఉండి మీ కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో సంతోషంలో, ఆనందంలో పాలు పంచుకున్నానని అన్నారు.
ప్రజల కష్టాల్లో కనపడని వ్యక్తి, కరోనా సమయంలో కాకరకాయ పంచని వ్యక్తి మనకు అవసరమా అని ప్రశ్నించారు. నా అభిమతం అభివృద్ధి మాత్రమే అని, ఏ స్వార్థం లేకుండా పని చేస్తున్నానని అన్నారు. కొనసాగుతున్న అభివృద్ధి అగకూడదు అంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. క్రైస్తవుల భూములు, చర్చిలకు అండగా ఉన్నానని,దీంతో వారి మనసుల్లో నా స్థానం పదిలం అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్‌కి మద్దతు ప్రకటించారు. సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ రాంబ్రహ్మం, బిషప్ కొడిరెక పద్మా రావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, ఏర్పుల కిషోర్, సురేశ్, సుధాకర్, పల్లా కిశోర్, కనపర్తి సంజీవరావు, కొమ్ము నాని ఉన్నారు.