ఖమ్మం, నవంబర్ 13: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. ఈ అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఫార్మా కంపెనీల పేరుతో అమాయక గిరిజన బిడ్డల భూములను తన అల్లుడి కోసం లూటీ చేసేందుకు తెగబడ్డ సీఎం రేవంత్‌రెడ్డి అక్రమాలకు వ్యతిరేకంగా గళమెత్తినందునే పట్నం నరేందర్రెడ్డిపై ప్రభుత్వం కక్షగట్టిందని ధ్వజమెత్తారు. ఫార్మా ఇండస్ట్రీ కోసం చేపట్టిన భూసేకరణను వెంటనే నిలిపివేయాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన నరేందర్‌రెడ్డిని, అమాయక రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్ ప్రాంత గిరిజన బిడ్డలపై రేవంత్ సర్కార్ చేస్తున్న దమనకాండను మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు.