ఖమ్మం రూరల్, జులై 11 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా కాలనీల్లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల బృందం పర్యటించింది. పార్టీ రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆయా కాలనీలోని బాధితులను పరామర్శించారు. నాయుడుపేట కాలనీలో బీఆర్ఎస్ కార్యకర్త ఆకిటి వరుణ్ తేజ్ సతీమణి చందన అనారోగ్యంతో బాధపడుతుండగా ఆపరేషన్ కోసం మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చొరవతో ఎమ్మెల్సీ తాతా మధు సిఫారసు మేరకు మంజూరైన రూ.1.50 లక్షల ఎల్ఓసీ మంజూరు పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా అదే కాలనీలో నివాసముంటున్న పసుపులేటి రవికుమార్ అనారోగ్యానికి గురికాగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
అనంతరం జలగం నగర్లో పర్యటించి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పార్టీ ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ హుస్సేన్ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు బానోత్ కృష్ణ, బానోత్ వీరన్న, బానోత్ మోహన్, మేకల ఉదయ్, శీలం రవికుమార్, చీరాల వీరభద్రం, వీరయ్య చౌదరి, షేక్ ఖాసిం, నరసయ్య, సోను సుమంత్, నన్నేమియా రాజేశ్, నవీన్ పాల్గొన్నారు.
Khammam Rural : ఏదులాపురం మున్సిపాలిటీలో పలు కుటుంబాలకు బీఆర్ఎస్ నాయకుల పరామర్శ