మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో రోజు శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడుతూ నిరసన ర్యాలీలు, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనాలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, భద్రాచలం, చర్ల మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు. చండ్రుగొండ జాతీయ రహదారిపై సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
చర్ల, మార్చి 15 : ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే కాంగ్రెస్ పాలకులు ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేశారని, ఇది సరైన విధానం కాదని బీఆర్ఎస్ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల కేంద్రంలో శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఉప కన్వీనర్ అయినవోలు పవన్‌కుమార్, సీనియర్ నాయకులు ఎస్డీ అజీజ్, పంజా రాజు, కాకి అనిల్, మాజీ ఎంపీపీ గీద కోదండరామయ్య, ఎడ్ల రాందాసు, బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి వినతి
భద్రాచలం, మార్చి 15 : సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో నాయకులు శనివారం నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఆకోజు సునీల్‌కుమార్ మాట్లాడుతూ శాసనసభ విధానాలకు అనుగుణంగా మాట్లాడే సీనియర్ నాయకుడు జగదీశ్‌రెడ్డి అని, ఆయనపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలు, విధానాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మండల కోకన్వీనర్ రేపాక పూర్ణచందర్రావు, నాయకులు అయినాల రామకృష్ణ, కాపుల సూరిబాబు, తూతిక ప్రకాశ్, అంబటికర్ర కృష్ణ, నానిపల్లి శ్రీను, బాసిపోయిన మోహన్‌రావు, రావూరి రవికిరణ్, బద్ది బాబి, ఇమంది నాగేశ్వరరావు, మురాల డానియేల్, ప్రదీప్, మహిళా నాయకులు కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మి, తెల్లం రాణి, గంపల రవికుమారి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ, మార్చి 15 : అసెంబ్లీ సమావేశాల నుంచి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు అని, అలాంటి హక్కులను సస్పెన్షన్లతో కాలరాయాలని చూడడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొణకండ్ల వెంకటరెడ్డి, దారా బాబు, సంగొండి రాఘవులు, నరుకుళ్ల సత్యనారాయణ, సూర వెంకటేశ్వరరావు, భూపతి రమేశ్, మేడా మోహన్‌రావు, సత్తి నాగేశ్వరరావు, పాండ్ల అంజన్‌రావు, పత్తిపాక వెంకటేశ్వర్లు, సయ్యద్ గఫార్‌మియా, కళ్లెం వెంకటేశ్వర్లు, సయ్యద్ బాద్షా, శివ పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లి, మార్చి 15 : ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌కు నిరసనగా బీఆర్ఎస్ నాయకుడు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు శనివారం నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేయడం సబబు కాదన్నారు. వెంటనే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శేషాద్రి వినోద్, ఎక్బాల్, తుంపిరి ప్రసాద్, కోరం చంద్రశేఖర్, రజాక్, శ్రీకాంత్‌నాయక్, మెరుపు రమేశ్, ఎర్రబడి శ్రీను, చిన్న, గోనె సురేశ్, కోట రాంబాబు, రసూల్, తాండ్ర నాగబాబు, టీ టైప్ మునీర్, అజ్మీరా విజయ్‌కుమార్, తంబాల శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.