ఖమ్మం/ సత్తుపల్లి టౌన్/ మణుగూరు టౌన్, మార్చి 23 : మహ్మద్ ప్రవక్త బోధనలను నేటి సమాజంలో అనుసరణీయమైనవని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.
రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఖమ్మం కాల్వొడ్డు మోతి మస్జీద్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి నమాజు ఆచరించారు. సత్తుపల్లి ఎన్టీఆర్నగర్ మసీదు, రాజీవ్‌నగర్ మసీదుల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. సింగరేణి కార్మిక నాయకుడు ఊకంటి ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో మణుగూరు బాంబేకాలనీ మహ్మదీయ మసీదులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు.