ఖమ్మం రూరల్: అబద్దాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నాడని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి గణేష్ నగర్ లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే భరోసాని కాంగ్రెస్ అంటే కన్నింగ్ అని యావత్ తెలంగాణ ప్రజలకు అనతి కాలంలోనే అర్థమైందని రాకేష్ రెడ్డి తెలిపారు.
6 గ్యారంటీలు 420 హామీలు పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కెసిఆర్ కేటీఆర్ ను తిట్టడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడని సీఎం రేవంత్ ఆశా భాషను చూసి యావత్ తెలంగాణ సమాజం చీదరించుకుంటుందన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసిన వారిపై కేసులు పెట్టడం జైలుకు పంపించడమే తెలంగాణ ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. మాట మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి బట్టలు ఊడదీసి కొడతామని అనడం ఆయనకే చెల్లుబాటు అవుతుంది అన్నారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లా ప్రజలకు ఒనగోరింది ఏమీ లేదన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయలేక ఆగమాగం అవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కన్నింగ్ వ్యవహారాలు పక్కనపెట్టి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. సమావేశంలో బెల్లం వేణుగోపాల్, భాష బోయిన వీరన్న, ఉన్న బ్రహ్మయ్య, విధుల పురం సొసైటీ చైర్మన్ జర్పుల లక్ష్మణ్ నాయక్, సోషల్ మీడియా బాధ్యుడు అందాల ఉదయ్ పాల్గొన్నారు.