తిరుమలాయపాలెం, ఏప్రిల్ 27 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో మండలంలోని 40 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండాలను ఆవిష్కరించారు. పార్టీ మండల అధ్యక్షుడు భాషబోయిన వీరన్న తిరుమలాయపాలెం, జల్లేపల్లిలో జరిగిన వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని హస్నాబాద్, మహమ్మదాపురం, ఏలువారుగూడెం, కేశ్వాపురం, పిండిప్రోలు, గోల్తాండ, ఇస్లావత్ తండా తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుమలాయపాలెంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు