కారేపల్లి,జూన్ 29: ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న మాతృమూర్తి అజ్మీర ఈరి(85)ఆదివారం రాత్రి కన్ను మూసింది. మండల పరిధిలోని బీక్యాతండా గ్రామంలో సోమవారం ఈరి అంత్యక్రియలు జరిగాయి. వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు లావుడ్యా రాములు నాయక్, బానోతు చంద్రావతి, నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు లతోపాటు పలువురు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
