తుమ్మల.. వెన్నుపోటుదారుడు
కాంగ్రెస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు వెన్నుపోటుదారుడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. అప్పట్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను, ఇటీవల మంత్రి పదవి ఇచ్చిన ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మోసం చేసింది తుమ్మల నాగేశ్వరరావేనని ఆరోపించారు.
- ఎన్టీఆర్, కేసీఆర్‌ను మోసం చేసింది ఆయనే..
- కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుంది
- సీఎం కేసీఆర్ పాలనలోనే త్రీటౌన్ అభివృద్ధి
- ఖమ్మం రోడ్‌షోలో బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్‌కుమార్
ఖమ్మం, నవంబర్ 14: కాంగ్రెస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు వెన్నుపోటుదారుడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. అప్పట్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను, ఇటీవల మంత్రి పదవి ఇచ్చిన ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మోసం చేసింది తుమ్మల నాగేశ్వరరావేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పాలనలో త్రీటౌన్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని, చెందుతోందని స్పష్టం చేశారు. కానీ పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అక్కడి అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఇక్కడి వాడినని, ఇకడే చదువుకున్నానని అన్నారు. కానీ ఖమ్మంపై తనకు ఉన్నంత ప్రేమ బయట నుంచి వచ్చిన వ్యక్తికి ఉండదని స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరంలో మంగళవారం పర్యటించిన ఆయన.. త్రీటౌన్ని 33, 34, 35, 36 డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. తాను ఖమ్మం బిడ్డనని, అందుకే ఇక్కడి ప్రజలు తనను ఆదరించి రెండు సార్లు గెలిపించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా మరోసారి గెలిపించాలని కోరారు. గతంలో తనపై గెలవలేక పోయిన తుమ్మల నాగేశ్వరరరావు.. ఈ ఎన్నికల్లో తన నామినేషన్‌ను తిరసరించాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని అన్నారు.
తుమ్మల జీవితమంతా అధర్మపోరాటమే..
తుమ్మల నాగేశ్వరరావు జీవితమంతా అధర్మపోరాటమేనని అజయ్ విమర్శించారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరినీ ఎదగనివ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ గెలిస్తేనే ఇకముందు కూడా ఖమ్మం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. ఒకప్పుడు కనీస సదుపాయాలు లేని ఖమ్మాన్ని నేడు ఆదర్శవంతంగా తీర్చిదిద్దానని గుర్తుచేశారు. సీఎం కేసీఆరే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని, అందుకోసం కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆయనను సీఎం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం, తోట ఉమారాణి, వీరభద్రం, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, పసుమర్తి రామ్మోహన్రావు, నున్నా మాధవరావు, మెంతుల శ్రీశైలం, చిన్ని కృష్ణారావు, మాటేటి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

