కారేపల్లి, డిసెంబర్ 23 : ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారేపల్లి మండలంలో స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవమైన బోటితండా సర్పంచ్ భూక్య తులసీరామ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తులసీరామ్ సోమవారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మెదడులో పక్షవాతం రావడంతో వైద్యుల సూచనతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్న కుటుంబ సభ్యులు తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని గ్రామస్తులు కోరుతున్నారు.