Jyothiba Phule Gurukul School | బోనకల్, ఫిబ్రవరి 19 : జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశాల మేరకు ఇవాళ మండల కేంద్రంలోని జ్యోతిబాపులే గురుకుల పాఠశాల (Jyothiba Phule Gurukul School)ను మండల తహసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం తయారుచేసిన భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అనిశెట్టి పున్నం చందర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన మెనూ ప్రకారం భోజనాన్ని తయారు చేయాలన్నారు. అంతేకాకుండా పరిశుభ్రంగా భోజనం, కూరలు తయారుచేసి ఆరోగ్యవంతమైన భోజనాన్ని వడ్డించాలన్నారు. విద్యార్థులకు గురుకుల పాఠశాలలో అల్పాహారం, భోజనం సకాలంలో వడ్డిస్తున్నారా..? లేదా అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. తహసీల్దార్ వెంట మండల విద్యాశాఖ అధికారి దామల పుల్లయ్య, ఆర్ఐ గుగులోతు లక్ష్మణ్, ప్రిన్సిపల్ జ్యోతిర్మయి, ఉపాధ్యాయులు ఉన్నారు.
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ
మాధవస్వామి గట్టుపై ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల.. గురుకుల పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ స్థల పరిశీలన