టేకులపల్లి నవంబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేయడం హేమమైన చర్య అని టేకులపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొమ్మెర వరప్రసాద్ ఖండించారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు లేని సమయాన అదునుగా చూసుకొని ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ రౌడీ నాయకులు అరాచకాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. జిల్లాలో పలు సమస్యలు పైన గళమెత్తి ప్రశ్నిస్తుంటే అభివృద్ధి చేయలేక దౌర్జన్యలకు పాల్పడుతున్నారని, నిరాధార మైన ఆరోపణలతో ఫర్నిచర్ దగ్ధం చేయడం అటవిక చర్య అన్నారు.
అభివృద్ధి చేయక ప్రశ్నిస్తే దాడులకు పాల్పడడటమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. ఇలాంటి దాడులకు పాల్పడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ పా ఉపాధ్యక్షులు బానోత్ రామా,యకులు జాలాది అప్పారావు, భూక్యాలాలు నాయక్, ఆమెడ రేణుక, ఆంగోతు లక్పతి, నానబాల బిక్షం, జర్పుల రాజు, కొండ బత్తుల శ్యాం, కొత్త చిట్టి రాజు, వాంకుడోత్ సందీప్, బి రాంబాబు ఉన్నారు.