KCR Birthday Cake | ఇల్లెందు, ఫిబ్రవరి 17: ఇవాళ కేసీఆర్ 70 పుట్టినరోజు సందర్భంగా ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, 70 కేజీల కేక్ (Birthday Cake) కట్టింగ్, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులతో కలిసి ఇల్లెందు బస్టాండ్ ఆవరణంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, ఉద్యమ నేత దిండిగల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ సాధకుడు ఉద్యమ నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ (KCR) ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, ఉద్యమ నేత దిండిగల రాజేందర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థిరస్థాయిగా ఉంటాడని.. గత పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సాధించిన కేసీఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని.. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దిండిగల రాజేందర్, సిలివేరి సత్యనారాయణ, అజ్మీరా బాక్సింగ్, జెకె శ్రీను, కటకం పద్మావతి, కంభంపాటి రేణుక,శీలం రమేష్, ప్రమోద్, నబి, హరికృష్ణ, రాజేష్, సురేష్, లక్ష్మీనారాయణ, బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
KCR Birthday | ‘ప్రజల హృదయాల్లో నిలిచి.. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్’
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్