కారేపల్లి, జూలై 18 : సైకిల్‌ను బైక్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో శుక్రవారం జరిగింది. ఖమ్మం పట్టణానికి చెందిన భూపతి సుమన్ బైక్‌పై ఇల్లెందు వైపు వెళ్తున్నాడు. సింగరేణి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాకు చెందిన వస్రాం సైకిల్‌పై కారేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇల్లెందు కారేపల్లి ప్రధాన రహదారిపై ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో బైక్ అదుపుతప్పి సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న సుమన్ తీవ్రంగా గాయపడగా, సైకిల్‌పై ఉన్న వస్రాంకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇరువురిని కారేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సుమన్‌ను మెరుగైన వైద్యం కోసం వైద్య సిబ్బంది 108 వాహనం ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.