– కాంగ్రెస్ పార్టీకి చెందిన 32 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరిక
– గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే
ఖమ్మం రూరల్, డిసెంబర్ 01 : అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో ఖమ్మం రూరల్ మండలంలో నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటనకు రివర్స్ కౌంటర్ అని మండలంలో చోరుగా చర్చ సాగుతుంది. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం, సీతారాంపురం గ్రామాలకు చెందిన 32 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సమక్షంలో సోమవారం పార్టీలో చేరారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ స్వగ్రామంలో ఈ చేరికలు జరిగాయి. గడిచిన నాలుగు రోజుల క్రితం ఆరెంపుల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా భావించిన నాయకుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. దీంతో నాలుగు రోజుల వ్యవధిలోని అదే ఎంపీటీసీ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీ కొండాపురం కీలక నాయకులు దాసరి వీరభద్రం, కనకం వీరబాబుల ఆధ్వర్యంలో వీరయ్య, నారపు రామకృష్ణ, వీరబాబు, శ్రీను, ఉప్పలయ్య, పోతురాజు లింగస్వామి, నాగేశ్వరరావు, భద్రయ్య, పుల్లారావు, యామిని, వెంకన్న, లింగయ్య, గుడిపాటి తిరుపతయ్య బీఆర్ఎస్ గూటికి చేరడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లైంది.