చుంచుపల్లి/ కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్ 13: మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. పట్టణంలోని పాత చుంచుపల్లి పోలీస్‌స్టేషన్ భవనంలోకి మార్చిన షీటీమ్స్, ఏహెచ్‌టీయూ కార్యాలయాలను ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున టీజీడబ్ల్యూఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమే షీటీమ్స్ అని అన్నారు.
లైంగిక వేధింపులు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, బ్లాక్ మెయిలింగ్ తదితర ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలు జిల్లా షీటీమ్స్‌ను నేరుగా సంప్రదించవచ్చన్నారు. జిల్లా షీటీమ్స్ నంబర్ 8712682131కు ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. అదనపు ఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీ రెహమాన్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్బీ ఇన్స్పెక్టర్లు నాగరాజు, శ్రీనివాస్, వన్‌టౌన్ సీఐ కరుణాకర్, 2టౌన్ సీఐ రమేశ్, సైబర్ క్రైమ్స్సీఐ జితేందర్, ఆర్ఐలు సుధాకర్, రవి, లాల్‌బాబు, కృష్ణారావు, షీటీమ్స్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ నాగరాజురెడ్డి, ఆర్ఎస్సై రమాదేవి తదితరులు పాల్గొన్నారు.