భద్రాచలం, జనవరి 1 : భద్రాచలం సీతారామచంద్రస్వామివారిని భద్రాచలం ఎమ్యెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్థంభం వద్ద నమస్కరించుకొని అంతరాలయంలోని మూలవరుల వద్ద ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం, స్వామివారి ప్రసాదాలు, శేష వస్ర్తాలు అందజేశారు.