కొత్తగూడెం టౌన్, ఏప్రిల్ 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సరిత పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వరంగల్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రేమలత భద్రాద్రి కొత్తగూడెం ప్రధాన న్యాయమూర్తిగా రానున్నారు.