Wyra | సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : వైరా ఎమ్మెల్యే..

ఏన్కూరు: కుల, మతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సబ్బండ వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ముందుగా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచుఉలకు 333 కోట్లతో 27 రకాల డిజైన్లలో చీరెలు అందించడం హర్షించదగ్గ విషయమన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు నిరాధారణకు గురయ్యాయన్నారు. నేడు తెలంగాణ, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను అద్దం పట్టే విధంగా బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరగడం విశేషమన్నారు. 3వ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్యా లాలునాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడా ధర్మారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాణోతు సురేష్‌నాయక్, సర్పంచ్ చిర్రా రుక్మిణి, ఎంపీపీ ఆరెం వరలక్ష్మీ, జడ్పీటీసీ బాదావత్ బుజ్జి , తహసీల్దార్ మహమ్మద్ షాఖాసీం, ఎంపీడీవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

