కారేపల్లి, సెప్టెంబర్ 09 : కారేపల్లి మండలం ఒడ్డుగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీఎస్యూటీఫ్ నాయకుడు బానోత్ మంగీలాల్ చొరవతో అతడి మిత్రులు మంగళవారం స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. మను, తృప్తేష్ షా, రామన్, జయసుధ, సంజయ్ పంచాల్ ఆర్ధిక సాయంతో కొనుగోలు చేసిన బ్యాగులను ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, కాంప్లెక్స్ హెచ్ఎం తేజావత్ శారద చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. దాతలను ఎంఈఓ జయరాజు అభినందించారు. ఈ సందర్భంగా ఉత్తమ అవార్డు అందుకున్న ఎంఈఓ దుగ్గిరాల జయరాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా నాయకుడు బానోత్ మంగీలాల్, హెచ్ఎం సత్యనారాయణ పాల్గొన్నారు.