దుమ్ముగూడెం, ఆగస్టు 25 : గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని చినబండిరేవు గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీకి చెందిన నల్లగట్ల సాగర్(25) మధ్యాహ్నం ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే భద్రాచలం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో ఎస్సీ కాలనీలో
విషాద ఛాయలు అలుముకున్నాయి.