Ramavaram : మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యాకూబ్ పాషా ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద గల అబుల్ కలాం ఆజాద్ ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నందు జరిగిన కార్యక్రమంలో యాకూబ్ పాషా ఎన్నికను రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ.ఫారూఖ్ ఏకగ్రీవంగా ఆమోదించారు.
రామవరం, ఆగస్టు 04 : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద గల అబుల్ కలాం ఆజాద్ ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నందు జరిగిన కార్యక్రమంలో యాకూబ్ పాషా ఎన్నికను రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ.ఫారూఖ్ ఏకగ్రీవంగా ఆమోదించారు. గత కొన్నేళ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనారిటీల సంక్షేమం కోసం నిరంతర శ్రమిస్తూ, విద్యార్థులకు అండదండగా ఉంటూ, మైనారిటీ సంక్షేమానికి పాటుపడుతున్నందున వీరి సేవలను గుర్తించి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందని ఎంఏ ఫారూఖ్ తెలిపారు.
ఈ సందర్భంగా యాకూబ్ పాషా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న మైనారిటీల సమస్యలపై ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మైనారిటీ సంఘాలు, రాష్ట్ర మైనారిటీ ఉద్యోగ సంఘం టీఎస్ మేసా ఎండీ.యాకూబ్ పాషాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ నాయకులు ఖాజా మొయినుద్దీన్, నఫీస్ అహ్మద్, మాజిద్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

