రుద్రంపూర్, మార్చి 28 : జూలై, నవంబర్ నెలల్లో అర్హత కలిగి ఉన్నప్పటికీ మెడికల్ అన్‌ఫిట్‌గా ప్రకటించని కార్మికులకు తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించాలని సింగరేణి యాజమాన్యాన్ని టీజీబీకేఎస్ కోరింది. మెడికల్ బోర్డు తక్షణమే నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యం నిర్వహించారు. అనంతరం గని మేనేజర్లు, డిపార్ట్మెంట్ హెడ్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విజిలెన్స్‌లో ఉన్న మారుపేరుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు తక్షణమే నెరవేర్చాలని తెలిపారు. గత సంవత్సరం నుండి మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న రెండు వేలకు పైగా కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.
సింగరేణి యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని హెచ్చరించారు. అలాగే వీకే కోల్ మైన్‌లో సింగరేణి యంత్రాలతో, సింగరేణి ఉద్యోగులతోనే బొగ్గు వెలికి తీయాలని పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియాలో సర్ఫేస్‌లో ఉన్న ఖాళీలను పీవీకే అండర్ గ్రౌండ్ కార్మికులతో పారదర్శకంగా, ఎటువంటి పైరవీలు లేకుండా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బోరింగ్ శంకర్, గిన్నారపు మహేందర్, నేమిళ్ల వెంకటేశ్వర్లు, రాజకుమార్, కృష్ణయ్య, వెంకట్, విజయ్ కుమార్, జిమ్మిడి అనుదీప్, రాజేశ్వరరావు, బాలాజీ, గడప రాజేష్, అన్వర్ పాషా, సుధాకర్ పాల్గొన్నారు.