రుద్రంపూర్, ఏప్రిల్ 09 : స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని డా.నవ జ్యోతి అన్నారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో
జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఈద్ మిలాఫ్” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్ని మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా ఇలా మహిళలంతా కలిసి ఒకరి పండుగలను, సంస్కృతులను మరోకరు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉపాధ్యాయురాలు లక్ష్మి మాట్లాడుతూ ప్రతి స్త్రీ కి విద్యా జ్ఞానం తప్పనిసరి అని, విద్యావంతురాలు అయినా మహిళల వల్ల సమాజ సంస్కరణ సాధ్యం అన్నారు.
సేవా సమితి సభ్యురాలు సత్యావతి మాట్లాడుతూ., కుల మతాలకు అతీతంగా జమాతే ఇస్లామి హింద్ వైద్య, విద్యా, వివాహాలకు సహాయం చేస్తూ చేస్తున్న సేవలను కొనియాడారు. జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షురాలు మాట్లాడుతూ.. మనందరి సృష్టి కర్త అయినా దేవుడు ఒక్కడే అని, కలసి మెలసి జీవించడంలోనే దైవానుగ్రం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జమాత్ సభ్యులు పర్వీన్ సుల్తాన్, నష్రా, పర్వీన్ బాను, షేహనాజ్, పర్వీన్ షమీం. ఆశ వర్కర్లు జ్యోతి, అంగన్వాడీ టీచర్లు సరస్వతీ, ఉపాధ్యాయురాలు రాధా, రజీయా, వార్డు మెంబర్ అరీపా పాల్గొన్నారు.