రామవరం, జూలై 17 : ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు అన్నారు. సీపీఐ శాఖ మహాసభల్లో భాగంగా గురువారం ఉన్నందాస్ గడ్డలో ఏర్పాటు చేసిన మహాసభలో శాఖా కార్యదర్శులుగా సూర్యుని జనార్ధన్, ఎస్.కె జలీల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, భూక్యా శ్రీనివాస్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే ఫయుం మాట్లాడుతూ.. ఎన్నికైన వారు అలంకారప్రాయంగా కాగా పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలన్నారు. తద్వారా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సహాయ కార్యదర్శులుగా తొగరు నరేంద్ర కుమార్, భూక్య మహేశ్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు కడారి మల్లేశ్, బానోతు చందర్, ఆది మల్లయ్య, సూరిమేని రామారావు, గుగులోతు శంకర్, నాగుల్ మీరా, అక్రమ్, బానోతు శ్రీనివాస్, సంద శ్రీను, జానీమియా పాల్గొన్నారు.