జూలూరుపాడు, ఆగస్టు 02 : శాంతి భద్రతల పరిరక్షణ అందరి బాధ్యతగా భావించి, ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, అసాంఘిక కార్యక్రమాలపై పోలీస్ శాఖ నిఘా నిరంతరం ఉంటుందన్నారు. అవినీతి, అక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తన అలవర్చుకుని, సమాజానికి చేయూతనందించే విధంగా ఎదగాలని సీఐ సూచించారు.