ఆళ్లపల్లి, ఆగస్టు 09 : ఆదివాసీల హక్కుల సాధనకై ఆదివాసీలందరూ ఏకం కావాలని మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, మాజీ జడ్పీటీసీ కొమరం హనుమంతరావు అన్నారు. శనివారం అక్షర సమిద స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆళ్లపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నృత్యాలు, గిరిజన వేషధారణతో, కోమ్ము డాన్స్, కోలాటాలు, డీజే చప్పుల నడుమ మండల కేంద్రం నుండి కొమరం భీమ్ స్థలం వరకు ప్రదర్శనగా వెళ్లి కొమరం భీమ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఆదివాసి జెండాను ఆవిష్కరించారు.
ఆదివాసీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈడబ్ల్యూసీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోడియం బాలరాజు, తెల్ల వెంకటేశ్వర్లు, కోర్స జై జై రాంబాబు, ఏడబ్ల్యూసీఏ భద్రాద్రి జిల్లా కార్యదర్శి జోగా రాంబాబు, సమ్మయ్య, పాపారావు, లక్ష్మీ, సమ్మక్క, నరసింహారావు, లక్ష్మయ్య, సాంబశివరావు, సత్యం, గాదె రాజు, వెంకటకృష్ణ, వినోద్, రమేశ్, ఈశ్వరి, రామనాథం, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.