‘వీబీ జీ రామ్ జీ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలపాలి’
వీబీ జీ రామ్ జీ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఉపాధి హామీ కార్మికులు జూలై 1న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు పంచాయతీ కార్యాలయాల వద్ద నిరసన తెలపాలని ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు..
– బత్తుల వెంకటేశ్వర్లు
బూర్గంపహాడ్, జూన్ 27 : వీబీ జీ రామ్ జీ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఉపాధి హామీ కార్మికులు జూలై 1న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు పంచాయతీ కార్యాలయాల వద్ద నిరసన తెలపాలని ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం సారపాకలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ పేదలకు కనీసం జీవన భద్రత లేకుండా చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం 125 రోజుల పని పెంచుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నా ఉపాధి కార్మికులకు ఆ మేరకు పనులు కల్పించడంలేదన్నారు. కేంద్రం కార్మికుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.
ప్రస్తుతం తీసుకువచ్చే వీబీ జీ రామ్ జీ స్కీంతో ఉపాధి కార్మికులకు నష్టం కలుగుతుందని, మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రతి పంచాయతీ కార్యాలయం వద్ద జూలై 1న ఉపాధి కార్మికులు తమ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ ఐటీసీ బీపీఎల్ జనరల్ సెక్రటరీ ఎస్ కె.పాషా, రైతు సంఘం మండల కార్యదర్శి కందుకూరి నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకులు బత్తుల గోపాలరావు, మర్రి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

