రామవరం, జూలై 26 : వివిధ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శనివారం కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమస్యాత్మక వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను గమనించాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. అలాగే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, సిబ్బంది పాల్గొన్నారు.