రామవరం, మే 01 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కొన్ని రోజులుగా ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, పిల్లలు, బాలింతలు, వారి బంధువులు నీళ్లు దొరకక ఇబ్బందులు పడ్డారు. విషయాన్ని మాతా శిశు ఆరోగ్య కేంద్రం, మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ రాధామోహన్ ఏరియా జీఎం శాలెం రాజు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన జీఎం సుమారు రూ.లక్ష వ్యయంతో రామవరం ఏరియాలోని పంజాబ్ గడ్డం నుండి ఆస్పత్రి వరకు నూతన పైప్‌లైన్‌ను సింగరేణి సివిల్ డిపార్ట్‌మెంట్‌చే వేయించారు.
దీంతో ఆస్పత్రిలో నీటి సమస్య తీరింది. చెప్పిన వెంటనే పనులు పూర్తిచేసిన ఏజీఎం సివిల్ సిహెచ్ రామకృష్ణ, ఆయన బృందాన్ని జీఎం అభినందించారు. అడిగిన వెంటనే స్పందించిన ఏరియా జీఎం శాలెం రాజు, పనులు త్వరితగతిన పూర్తిచేసిన ఏజీఎం సివిల్ సీహెచ్ రామకృష్ణ, వారి బృందానికి రాధా మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Ramavaram : రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో తీరిన నీటి సమస్య