రామవరం, మే 03 : క్రీడలు మానసిక ఉల్లాసానికి , శారీరక దారుఢ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని, పిల్లల్లో క్రీడా స్ఫూర్తితో పాటు వ్యక్తిగత వికాసానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జీఎం జీవి కోటిరెడ్డి అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ జడ్పీహెచ్ఎస్లో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను ప్రారంభించి మాట్లాడారు. శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ వి.మల్లికార్జునరావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ.రజాక్, డీజీఎం(పర్సనల్) బి.శివకేశవరావు, హానర్‌బుల్ సెక్రెటరీ ఎండీ.ఖలీల్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ జె.రాంబాబు, స్పోర్ట్స్ మెంబర్ సీహెచ్.సాగర్, కె.శ్రీనివాస్ రెడ్డి, జడ్పీహెచ్ఎస్ రుద్రంపూర్ ప్రిన్సిపాల్ బాలాజీ, స్కూల్ పీఈటీ కవిత, శిక్షకులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.