– కరకగూడెం మండల బీఆర్ఎస్ నాయకులు
కరకగూడెం, మే 28 : ఐకేపీ వీఓఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ కరకగూడెం మండల శ్రేణులు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయం వద్ద వీఓఏలు గత కొద్ది రోజులుగా చేస్తున్న నిరవదిక దీక్షకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు వీఓఏలకు మద్దతు తెలుపుతున్నట్లు వివరించారు. వీఓఏల కనీస వేతనం రూ.20 వేలు అందజేయాలన్నారు. గ్రేడింగ్ విధానం రద్దు చేసి సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలన్నారు.
అర్హులైన ప్రతి ఒక్క వీఓఏకు సీసీ ఉద్యోగ పదోన్నతి కల్పించాలని, వీఓఏల సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యం రూ.20 లక్షలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఓఏలు కోరుతున్న డిమాండ్లు ఎంతో న్యాయబద్ధమైనవని, ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొగు వెంకటేశ్వర్లు కొమరం రాంబాబు, బుడగం రాము, రామకృష్ణరెడ్డి, రామనాథం, చిరంజీవి, నరసింహారావు, విశ్వనాథం, సత్యనారాయణ, సందీప్, కనకయ్య, ఆదినారాయణ, ముత్తయ్య, లెనిన్, సతీష్, బాలయ్య, మురళి, రామారావు పాల్గొన్నారు.