చుంచుపల్లి, ఆగస్టు 13 : పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటుతూ వృక్ష మిత్రుడిగానే కాకుండా సమాజ సేవలో తాను సైతం అంటూ చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన జయరామ్ తనయుడు చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. కొత్తగూడెంకు చెందిన జంపన్న భార్య మంజుల గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. సోషల్ మీడియా ద్వారా విషయం తెలిసిన విశ్వామిత్ర చౌహాన్ తన కిట్టి బ్యాంక్లో దాచుకున్న రూ.5 వేలను ఆ కుటుంబానికి ఇచ్చి మానవత్వం చాటుకున్నాడు.