ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా ఆళ్లపల్లి మండలం భూసరాయిలో దారుణం చోటుచేసుకున్నది. మంత్రాల నెపంతో మడకం బీడ అలియాస్ రాజు అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడిచేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు.
గుత్తికోయలు ఉండే భూసరాయిలో మంగళవారం ఉదయం ఓ మహిళ మృతిచెందింది. అయితే మంత్రాలు చేయడంతోనే ఆమె చనిపోయినట్లు గ్రామస్థులు రాజుపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అతనిపై దాడి చేయడంతో మరణించాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.