– అవినీతి నిర్మూలనకు ఉద్యోగులందరూ బాధ్యతగా వ్యవహరించాలి
– సింగరేణి అధికారులు
రుద్రంపూర్, సెప్టెంబర్ 04 : అవినీతి నిర్మూలన, పారదర్శకత, నిజాయితీపై ప్రతి ఉద్యోగి అవగాహన కలిగి ఉండాలని సింగరేణి అధికారులు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ఏరియాలోని వీకేసీఎం వద్ద కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎఫ్) ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఉద్యోగులకు సూచించారు. అవినీతి సంస్థ అభివృద్ధికే కాకుండా సమాజ పురోగతికి కూడా అడ్డంకిగా మారుతుందని, దాని నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పేర్కొన్నారు.
సీఎంపీఎఫ్ పథకాలు, ఉద్యోగులకు అందుతున్న ప్రయోజనాలు, ప్రావిడెంట్ ఫండ్ సేవలు, వాటిలో పారదర్శకత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మధ్యవర్తులను ఆశ్రయించకుండా అధికారిక సమాచారం కోసం సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ కమిషనర్లు వంశీధర్, కనకమ్మ, అసిస్టెంట్ కమిషనర్ చిరంజీవి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సులోచన, శ్రీనివాస్, వీకేసీఎం మేనేజర్ మురళి, ఏఐటీయూసీ ప్రతినిధి హీరాలాల్, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ గోపు కుమారస్వామి, సీఎంపీఎఫ్, సింగరేణి అధికారులు, వెంకటేష్ ఖని ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.