రామవరం, డిసెంబర్ 04 : సత్తుపల్లికి డిప్యూటేషన్‌పై వెళ్లిన వారందరిని వెంటనే వీ కే కోల్ మైన్‌కు తీసుకు రావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రామవరం ప్రొఫెసర్ జయశంకర్ కార్మిక భవన్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యూనియన్ ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులు దొంగ మాటలు చెప్పి గెలిచినా రెండు యూనియన్లు ట్రాన్స్ఫర్, డిప్యూటేషన్, పైరవిలకు పరిమితం అయ్యాయని, కార్మికులు పడుతున్న ఇబ్బందులు వారి కంటికి కనబడడం లేదని దుయ్యబట్టారు.
గత వంద సంవత్సరాల నుండి సింగరేణి కార్మికుల ద్వారా కొత్తగూడెం ప్రాంతంలో సింగరేణి బొగ్గు తవ్వకాలు చేశారు. కొత్తగా ప్రారంభమైన వెంకటేష్ కోల్ మైన్‌లో బొగ్గును ప్రెవేటు వారితో తవ్వకాలు చేపట్టేందుకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంన్నారు. ఆ ప్రయత్నాన్ని యాజమాన్యం విరమించుకోవాలన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్లో సింగరిణి కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి పనులను చేపించాలని, అనుభవజ్ఞులైన అధికారులు, శిక్షణ పొందిన ఉద్యోగులు, భారీ యంత్రాలు ఉన్నా కూడా ప్రైవేట్ వ్యక్తులతోని బొగ్గు ఉత్పత్తి పనులను చేపడితే సింగరేణి కార్మికుల మనుగడకు ప్రమాదం పొంచి ఉందని, ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదన్నారు. యాజమాన్యం స్పందించకపోతే ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు.
గతంలో గౌతమ్ ఖని ఓపెన్ కాస్ట్ ను ఏ విధంగా అయితే యాజమాన్యం నడిపించిందో అదేవిధంగా వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ ను సింగరేణి కార్మికులతోనే నడిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్, సెంట్రల్ కమిటీ మెంబర్ ప్రసాద్, ఈశ్వర్, బోరింగ్ శంకర్, బ్రాంచ్ సెక్రటరీలు రవివర్మ, తిరుపతి, అశోక్, పిట్ సెక్రటరీలు జీ ఎస్ శ్రీనివాసరావు, జైపాల్, సూర్యనారాయణ, విజయ్ భాస్కర్, ఆంజనేయులు, రాంబాబు, అశోక్ పాల్గొన్నారు.