రుద్రంపూర్, ఆగస్టు 25 : పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతో అవసరమని రుద్రంపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ తోట సంతోష్ కుమార్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. డంపింగ్ యార్డులో 600 వెదురు మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని, పంచాయతీ పరిధిలో మొత్తం 5,300 మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని డంపింగ్ యార్డు, రహదారుల ఇరువైపులా, ప్రకృతి వనం తదితర ప్రాంతాల్లో నాటనున్నట్లు పేర్కొన్నారు. ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, మొక్క నాటడంతో పాటు మీరే కాకుండా మరో వ్యక్తితోనూ మొక్క నాటించాలని పిలుపునిచ్చారు. కుటుంబ వేడుకల సందర్భంగా మొక్కలు నాటే సంప్రదాయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బోగ నరేంద్ర, ప్రసాద్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సత్యవతి, ఫీల్డ్ అసిస్టెంట్ కేస్లీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

రుద్రంపూర్లో వన మహోత్సవానికి శ్రీకారం