రామవరం మే 02 : ప్రతీ ఏడాది సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో నిర్వహించే సమ్మర్ క్యాంప్‌లను ఈ ఏడాది కూడా సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు శుక్రవారం తెలిపారు. 18 సంవత్సరాల లోపు సింగరేణి ఉద్యోగుల పిల్లలు (బాల బాలికలు), కొత్తగూడెం పరిసర ప్రాంతాల పిల్లలు ఈ శిక్షణకు హాజరు కావొచ్చన్నారు. ఈ నెల 3 నుండి 28వ తేదీ (25 రోజులు) వరకు అనుబవజ్ఞులైన శిక్షకులచే సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించబడుతుందని వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు 3వ తేదీ శనివారం మధ్యాహ్నం 1.00 గంట లోపు కొత్తగూడెం ఏరియా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ (9959508782) ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ అందించే క్రీడాంశాలు ఈ విధంగా ఉన్నాయి.
1. హాకీ : పివిఎన్ఆర్ కాలనీ గ్రౌండ్స్, సత్తుపల్లి ఉదయం 6 నుంచి 8 గంటల వరకు అలాగే సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు
2. ఫుట్‌బాల్ : సాధన గ్రౌండ్స్ రామవరం, ఉదయం 6 నుంచి 8 గంటల వరకు. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు
3. వాలీబాల్ : సిఈఆర్ క్లబ్, రుద్రంపూర్ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు
4. అథ్లెటిక్స్ : ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్, గౌతమ్ పూర్ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు
5. కిక్ బాక్సింగ్ : రెస్క్యూ గ్రౌండ్స్ 3ఇంక్లైన్, ఉదయం 6 నుంచి 8 గంటల వరకు. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు.
పైన తెలిపిన క్రీడల్లో పాల్గొని, నైపుణ్యం సంపాధించి ఈ వేసవి సెలవులను సద్వినియోగ చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.