రామవరం, సెప్టెంబర్ 20 : కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో టూ టౌన్ సీఐ డి.ప్రతాప్ ఆదేశాల మేరకు ఎస్ఐ ఎం.మనీషా సిబ్బందితో కలిసి గరీబ్‌పేట వైపు పెట్రోలింగ్ చేస్తుండగా, సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఎండీ షారుక్, కందుల అనిల్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద సోదాలు నిర్వహించగా గంజాయి లభించింది. భద్రాచలం-చర్ల రోడ్డులోని చేపల మార్కెట్ వద్ద నివసించే రమేశ్ అనే వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అనంతరం గంజాయిని తాగేందుకు, చిన్న పొట్లాలుగా చేసి ఇతరులకు అమ్మేందుకు వచ్చినట్లు వెల్లడించారు. వారి వద్ద నుండి 100 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Ramavaram : గంజాయి విక్రేతలు ఇద్దరు అరెస్ట్