రోడ్డు మరమ్మతులు చేపట్టాలని టిప్పర్ డ్రైవర్ల నిరసన
కేఓసీ లోడింగ్ పాయింట్, కొత్తగూడెం ఆర్ఎఫ్సీఎల్ అన్ లోడింగ్ పాయింట్ వద్ద రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టిప్పర్ డ్రైవర్లు బుధవారం నిరసన తెలిపారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) ఆధ్వర్యంలో...
టేకులపల్లి, అక్టోబర్ 28 : కేఓసీ లోడింగ్ పాయింట్, కొత్తగూడెం ఆర్ఎఫ్సీఎల్ అన్ లోడింగ్ పాయింట్ వద్ద రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టిప్పర్ డ్రైవర్లు బుధవారం నిరసన తెలిపారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) ఆధ్వర్యంలో సుమారు గంటసేపు ఆందోళన చేపట్టడంతో టిప్పర్లు గంటసేపు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాయం వెంకన్న, టేకులపల్లి ఏరియా కార్యదర్శి జరుపుల సుందర్ మాట్లాడుతూ.. రోడ్లపై గుంతల కారణంగా లారీల టైర్లు, ఇతర భాగాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. మరమ్మతులకు ఒక్కోసారి రూ.10 వేల వరకు ఖర్చవుతోందని, లారీలు ఒక రోజు నిలిచిపోవడంతో యజమానులు, డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు మరమ్మతులు చేపట్టాలని టిప్పర్ డ్రైవర్ల నిరసన
బొగ్గు రవాణాపై దృష్టి సారిస్తున్న సింగరేణి యాజమాన్యం డ్రైవర్ల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. విషయం తెలుసుకున్న కేఓసీ పీవో నిరసన స్థలానికి చేరుకుని యూనియన్ నాయకులతో చర్చించారు. కేఓసీ లోడింగ్ పాయింట్ వద్ద సమస్యను వెంటనే పరిష్కరిస్తామని, కొత్తగూడెం ఆర్ఎఫ్సీఎల్ అన్లోడింగ్ పాయింట్ వద్ద రోడ్డు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో డ్రైవర్లు నిరసన విరమించి లోడింగ్‌కు వెళ్లారు. ఈ నెల 30న ఇల్లెందు ఎల్లన్న విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికుల రాష్ట్రస్థాయి జనరల్ బాడీ సమావేశానికి కోల్ ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు, కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పాయం వెంకన్న, జరుపుల సుందర్ కోరారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు సందీప్, వినయ్, నరేశ్, రాకేశ్, రామ్‌కోటి, వీరన్న, చిరంజీవి, రమణయ్య, ఆకాశ్, సంతు, వెంకటేష్, శ్యామ్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు మరమ్మతులు చేపట్టాలని టిప్పర్ డ్రైవర్ల నిరసన
MLA Sudheer Reddy | ఎవరి గూడు చెదరనివ్వబోం.. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
తక్కెళ్లపాడు సర్పంచ్‌కు మంత్రి సీతక్క ప్రశంస
Arnab Cyclone | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. ఏపీలో మరో ఏడు రోజులు కుండపోత వర్షాలు..!
‘నవంబర్ 3న జరిగే జాతీయవాదుల సంగమం–2026ను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

