విద్యుదాఘాతానికి గురై మూడు బర్రెలు మృతి
దమ్మపేట మండలం గోపాలపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై మూడు బర్రెలు మృతి చెందాయి. గతరాత్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గోపాలపురం గ్రామంలోని ఒక పామాయిల్ తోటలో ఉన్న చెట్లు గాలివాన ధాటికి విరిగి పక్కనే ఉన్న..
దమ్మపేట, జూలై 04 : దమ్మపేట మండలం గోపాలపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై మూడు బర్రెలు మృతి చెందాయి. గతరాత్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గోపాలపురం గ్రామంలోని ఒక పామాయిల్ తోటలో ఉన్న చెట్లు గాలివాన ధాటికి విరిగి పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో విద్యుత్ వైర్లు తెగి నేలకొరిగాయి. ఈ విషయం తెలియని స్థానిక రైతు దండి జయమ్మ అనే మహిళ శనివారం ఉదయం తన బర్రెలను మేపడానికి ఆ పామాయిల్ తోట వైపు తోలుకెళ్లింది. తోటలో కిందపడి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో మేతమేస్తున్న బర్రెలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. పక్కనే ఉన్న జయమ్మ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ జీవనాధారమైన మూడు బర్రెలు ఒకేసారి మృత్యువాత పడడంతో బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. దాదాపు రెండున్నర లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి తగిన నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధితురాలు, స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

