టేకులపల్లి, ఫిబ్రవరి 04 : టేకులపల్లి మండలంలోని టేకులపల్లి, దాసుతండ, సింగ్యాతండ, లచ్యతండ ఎ-కాలనీ, బి-కాలనీ పరిధిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టేకులపల్లి ఏఈ హాట్కర్ దేవా తెలిపారు. విద్యుత్ లైన్లు మరమ్మతుల వల్ల విద్యుత్ సరఫరా ఉండదని, విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించగలరని ఆయన కోరారు.