పోచమ్మ తల్లి దేవాలయంలో చోరీ
చుంచుపల్లి మండలంలోని ధన్బాద్ పంచాయతీ పరిధిలో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయంలో జరిగిన చోరీ, విగ్రహ ధ్వంసం ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రుద్రంపూర్, ఏప్రిల్ 21 : చుంచుపల్లి మండలంలోని ధన్బాద్ పంచాయతీ పరిధిలో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయంలో జరిగిన చోరీ, విగ్రహ ధ్వంసం ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ దేవాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుడి తలుపుల తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం హుండీని పగలగొట్టి నగదు దోచుకెళ్లడమే కాకుండా, అమ్మవారి విగ్రహం ఎడమచేయిని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ డి.ప్రతాప్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలను సేకరించారు. నిందితులను త్వరలో పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే జాతీయ రహదారి పక్కనే ఉన్న దేవాలయంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన పోలీసు పెట్రోలింగ్ లేకపోవడమే ఇటువంటి దొంగతనాలకు కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

